రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడంలో ఈ మధ్య కొంత సంయమనం పాటించిన వైసిపి అధినేత జగన్( CM Jagan ) మరొకసారి మునుపటి తీవ్రతను ప్రదర్శిస్తూ చంద్రబాబుపై ( Chandrababu Naiud ) తీవ్ర విమర్శలు చేశారు.ఇటీవల రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు ఇంటర్వ్యూ ను ఉద్దేశిస్తూ ఆయన సెటైర్లు వేశారు.
చంద్రబాబు ప్రవర్తన చూస్తే పంచతంత్ర కథల్లో ముసలి పులి( Panchatantram ) గుర్తుకొస్తుందని వేటాడే శక్తి లేక తోడేళ్లతో స్నేహం చేసే ఆ పులి ప్రజలను చంపి పోగేసుకున్న నాగానట్రా మళ్లీ ఆ ప్రజలకే ఎర వేసే కుటిల యుక్తులు పన్నుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
వచ్చిన వారిని వచ్చినట్టే చంపి తినటం ఆ పులి స్వభావమని అది మాంసాన్ని తినడం మానేసింది అంటే ఎవరైనా నమ్మగలమా అంటూ ఆయన ప్రశ్నించారు.అబద్ధాలే ఆయన ఊపిరి అని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను వంచించారని, సున్నా వడ్డీ రుణాలను ఎత్తివేసారని అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేశారని ఇప్పుడు తాము మారిపోయామంటూ అబద్ధపు హామీలతో మరొకసారి

అదికారం లోకి రావాలని కుట్రలు పన్నుతున్నారని అయితే ప్రజలకు వీరి నిజస్వరూపం ఎప్పుడో అర్థం అయిపోయిందని వారే ఆయన కుట్రలు తిప్పికొడతారని ఆయన చెప్పుకొచ్చారు .పరిపాలనలోనూ సంక్షేమ పథకాలు( Welfare Schemes ) అమలులోను గత ప్రభుత్వంతో పోల్చి ఏది మంచిదో మీరే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తున్న మీ బిడ్డను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకే ఉందంటూ ఆయన ప్రజలకు సూచించారు.

ఎన్ డి ఏ ప్రభుత్వంలో చేరడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్న తెలుగుదేశం అందుకు అవకాశం ఉన్న అన్ని దారులను ఉపయోగించుకుంటుంది.ఇప్పుడు రిపబ్లిక్ టీవీ వేదికగా జరిగిన కార్యక్రమంలో కూడా మోడీతో కలిసి పని చేయాలన్న తన ఆసక్తిని పరోక్షంగా చంద్రబాబు ప్రకటించుకున్నట్లుగా తెలుస్తుంది …….ఈ పరిణామాలను జగన్ నిశితంగా గమనిస్తున్నారని అ సహనంతోనే జగన్ ఇలా చంద్రబాబు పై విమర్శలు చేశారని వార్తలు వస్తున్నాయి.