కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.తెలంగాణ సొమ్ముతో కేంద్రం కులుకుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలతోనే బీజేపీ పాలిత రాష్ట్రాలను అభివృద్ధి చేశారని ఆరోపించారు.కాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.
కిషన్ రెడ్డి చెప్పేది తప్పైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు.ఇక్కడ పన్నులు వసూలు చేసి ఉత్తర భారత్ లో పంచడం లేదా అని నిలదీశారు.పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు వెళ్లాయని తెలిపారు.అందులో రూ.1.68 లక్ష కోట్లు మాత్రమే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందని వెల్లడించారు.







