నందమూరి బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ కూడా బాలయ్య కెరియర్ లోనే అత్యధికం గా నమోదయ్యాయి.
దాదాపు సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు అఖండ గురించి సందడి మొదలైంది.హిందీ లో అఖండ సినిమా ను డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నట్లుగా పెన్ స్టూడియో వారు అధికారికం గా ప్రకటించారు.
హిందీ ట్రైలర్ ని కూడా విడుదల చేసిన వారు అఖండ సినిమా ను కచ్చితం గా హిందీ ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ధీమా వ్యక్తం చేశారు.భారీ చిత్రాలను అందిస్తున్న పెన్ స్టూడియో వారు అఖండ సినిమా ను భారీ ఎత్తున హిందీ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఒక వైపు తెలుగు లో బాలకృష్ణ కొత్త సినిమా వీర సింహా రెడ్డి ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఇదే సమయం లో బాలకృష్ణ అఖండ సినిమా హిందీ లో విడుదల కాబోతున్న నేపథ్యం లో ఆయన అభిమానులకు డబుల్ ధమాకా ఖాయమంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వీర సింహా రెడ్డి సినిమా ఎలాగూ సక్సెస్ ని దక్కించుకుంటుంది అని చాలా నమ్మకం గా అంతా కనిపిస్తున్నారు.ఇప్పుడు అఖండ సినిమా కూడా హిందీ లో సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ నమోదు చేస్తే బాలకృష్ణ కు డబుల్ ధమాకా అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఒక వైపు హిందీ లో మరో వైపు తెలుగు లో వేరు వేరు సినిమాలు ఒకే సారి విడుదల కాబోతున్న నేపథ్యం లో బాలయ్య అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వాటి ఫలితాల గురించి ఎదురు చూస్తున్నారు.మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి బాలకృష్ణ కు ఆ రెండు సినిమాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూడాలి.







