తమ ప్రతిభ మీద నమ్మకం ఉన్నవాడికి ముహూర్తాలు, గ్రహాలు అవసరం లేదు.అలాంటివి ఎన్నో చుసిన వారు అందరు గొప్ప వారు అయ్యారా ? అవి చూడని వారు విజయాలు సాధించలేరా ? అంటే ఖచ్చితంగా సాధించగలరు.అందుకు ఉదాహరణ రామోజీ రావు లాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తులు.వ్యక్తులు అనేకన్నా వ్యవస్థ అంటే గొప్పగా ఉంటుంది.రామోజీ రావు కి కొత్త ట్యాలెంట్ ఎక్కడ ఉన్న కూడా వెలికి తీయడం అలవాటు.అలాంటి వారికి పిలిచి అవకాశాలు ఇస్తారు.
ఆలా ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి వారి జీవితాన్ని మార్చడమే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలను తీసి గట్టిగా కాష్ చేసుకోవడం లో అయన తర్వాతే ఎవరైనా.
అలాంటి ఒక సంఘటన ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడిగా మన అందరికి పరిచయమే.అయన సినిమా ఇండస్ట్రీ కి రావడానికి చాల ఇబ్బందులు పడ్డారు.
ఆలా తనకు మొదటి సారి అవకాశం వచ్చింది నీ కోసం అనే సినిమాతో.ఈ సినిమాలో రవితేజ మరియు మహేశ్వరీ మెయిన్ లీడ్ గా నటించారు.
ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు.కానీ ఒక ఫీల్ గుడ్ మూవీ గా మాత్రం నిలిచింది.
ఈ చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ గా, బెస్ట్ రైటర్ గా నంది అవార్డులు అందుకున్నారు శ్రీను వైట్ల.ఇక ఈ సినిమా బెస్ట్ ఫీచర్ మూవీ గా కూడా నిలిచింది.
ఈ సినిమా చుసిన రామోజీ రావు ఒక రోజు శ్రీను వైట్ల ను పిలిచారట.నీ కోసం సినిమాను చాల బాగా తీసావ్ నీ నెక్స్ట్ సినిమా మన బ్యానర్ లోనే చేయాలి అని చెప్పారు.

దాంతో ఒక మంచి కథ పట్టుకొని వెళ్లి ఆయనకు చెప్పగానే రామోజీ రావు ఒప్పుకొని సినిమా చేద్దాం అన్నారు.అందుకు శ్రీను వైట్ల సంతోషం సర్ ఒక మంచి రోజు చూసుకొని సినిమా మొదలు పెడదాం అని అన్నాడట.దాంతో రామోజీ రావు మాత్రం ఒక చెడ్డ రోజు సినిమా మొదలు పెడితే బాగా ఆడదా అని చెప్పారట.ఆలా తీసిన సినిమానే ఆనందం.ఈ సినిమా 200 డేస్ ఆడింది.అన్ని మేజర్ థియేటర్లలో వంద రోజులు ఆడింది.
నిర్మాతకు కనక వర్షం కురిపించింది.సినిమాలోని లవ్ ఇన్స్, సంగీతం, కామెడీ అన్ని బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
అది సంగతి, ట్యాలెంట్ ని నమ్ముకున్నోడికి మంచి ముహుర్తాలతో పని లేదు.







