సినిమా పరిశ్రమ ఎప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది.నిన్నటికి, నేటికి మరియు రేపటికి కొత్త విషయాలు వస్తూ పాత వాటిని చరిత్రగా చేస్తూ ఉంటాయి.
ఈ విషయాలను సీనియర్ దర్శకుడు అయినా రేలంగి నరసింహ రావు ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.ఒకప్పటి పరిశ్రమకు, నేటి పరిశ్రమకు మధ్య చాల వ్యత్యాసం ఉందనేది అయన వర్షన్.
గతం లో అయన ఒక కథను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కి చెప్పారట.ఆ టైం లో ఆయన కొడుకు రాఘవేంద్ర ను హీరో గా పెట్టి సినిమా తీయాలని అనుకున్నారు.
అయితే కథ తో పాటు సినిమా ఎలా తీయాలి అనుకున్నారో అర్ధం కావడం కోసం ఒక వంద సీన్స్ కూడా బాగా రాసుకొని తీసుకెళ్లారట.
చూడగానే రాజ్ కుమార్ సైతం బాగా ఉంది, ఇక తదుపరి స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేయండి అని చెప్పారట.
అయితే నాకు రచయితను ఇప్పించండి మిగతా స్క్రిప్ట్ మరియు సీన్స్ ని పూర్తి చేస్తాను అనగానే మీరు రాసిన కథ మరియు సీన్స్ చాల బాగున్నాయి మరొక రైటర్ ని పెడితే ఆ ఫ్లేవర్ మిస్ అవ్వచ్చు అన్నారు.కానీ అందుకు రేలంగి వారు ఒప్పుకోలేదు.
ఎందుకంటే రచయిత మరియు దర్శకుడు కలిసి కాపురం చేస్తేనే అద్భుతమైన సినిమా బిడ్డ పుడుతుంది అని చెప్పారు.

ఆ మాట చెప్పగానే రాజ్ కుమార్ బాగా చెప్పారు మీరు రైటర్ నాగ భూషణం తో మిగతా స్క్రిప్ట్ ని పూర్తి చేయండి అని చెప్పారట.అయితే రేలంగి ఆ టైం లో మిగతా స్క్రిప్ట్ కూడా బాగా రాయగలరు మరియు తీయగలరు.కానీ రచయితే ఉంటేనే మరింత బలంగా కథను ప్రెజెంట్ చేయగలం అని నమ్ముతారు రేలంగి.
ఎక్కడైనా తప్పులు ఉంటె సరిదిద్దడానికి కూడా ఉపయోగపడుతుంది అని అంటారు.

ఇక గతంలో డైరెక్టర్ దాసరి సైతం ఇలాగే ఒక్కరే కథ, కథనం మరియు మాటలు, సంభాషణలు అన్ని ఆయనే చేసేవారు.కానీ ఆలా అయన అంత పర్ఫెక్ట్ గా అన్ని శాఖలపైన పట్టు సాధించుకోవడానికి అయన ఆఫీస్ లో ఖచ్చితంగా ఒక పది మంది ని పెట్టుకునే వారు.అయన గురువు గారు ఆయిన పాలగుమ్మి పద్మరాజు తో పాటు,, తమిళ రచయితలు ధర్మరాజు, తెలుగు లో దాసం గోపాల కృష్ణ, లక్ష్మణ రావు మరియు కాశి విశ్వనాధ్ వంటి వారితో నిత్యం చర్చలు సాగించి బాగా నేర్చుకునే వారు.
కానీ నేడు ఆ వాతావరణం లేదు.అంత పెద్ద వాళ్ళను కనీసం అడగను కూడా లేరు.







