ఏపీలో బిజెపితో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల తెలంగాణలో టిడిపిని మళ్లీ యాక్టివ్ చేసి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో టిడిపిని యాక్టివ్ చేయడం ద్వారా, అక్కడ తమ బలం నిరూపించుకుంటే , తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి తమతో కచ్చితంగా పొత్తు పెట్టుకుంటుందని , ఆ తరువాత ఆ పొత్తును ఏపీ వరకు కొనసాగించే ఆలోచనలో బాబు అంచనా వేసుకున్నారు.అయితే తెలంగాణ బిజెపి నాయకులు మాత్రం టీడీపీతో పొత్తు ఉండదంటూ ప్రకటనలు చేయడం టిడిపిలో నిరాశ కలిగించింది.ఇక బిజెపి పెద్దలు ఇదే వైఖరితో ఉండడంతో బాబు ఆశలు ఇక నెరవేరినట్టే అని అంత అనుకుంటుండగా , ఇప్పుడు బిజెపి పెద్దలు ప్రధాని నరేంద్ర మోది, అమిత్ షాల మనసు మారుతున్నట్టే కనిపిస్తోందట.
2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు.మూడోసారి కేంద్రంలో బిజెపి జెండా ఎగరవేసేందుకు అనువుగా పరిస్థితులను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 543 లోక్ స్థానాల్లో ప్రస్తుతం బిజెపికి 303 స్థానాల్లో బలం ఉంది.
అయితే 2024 ఎన్నికల్లో ఆ సీట్లు మరింత తగ్గుతాయని దాదాపు 144 లోక్ సభ స్థానాలు బిజెపికి తగ్గుతాయనే అంచనా వేస్తున్నారు.దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకుని ఆ లోటును బిజెపి పెద్దలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
దీనిలో భాగంగానే ఏపీలో అవసరమైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట .

ఇప్పటికే జనసేన తో పొత్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో, టిడిపిని కలుపుకుని వెళితే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారంట.అవసరమైతే తెలంగాణలోని టిడిపి మద్దతు తీసుకుంటే మంచిదనే అభిప్రాయంతో బిజెపి పెద్దలు ఉన్నారట.ఈ పరిణామాలు టీడీపీ లో మంచి జోష్ ను నింపుతున్నాయి.







