బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లాస్య గురించి అందరికీ సుపరిచితమే.కెరీర్ మొదట్లో యాంకర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లాస్య వివాహం తర్వాత యాంకరింగుకు పూర్తిగా గుడ్ బై చెప్పారు.
వివాహం తర్వాత ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లాస్య ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే ఏదైనా పండుగలప్పుడు బుల్లితెర చానల్స్ నిర్వహించే స్పెషల్ ఈవెంట్ లో కూడా ఈమె సందడి చేస్తున్నారు.ఇక లాస్య మంజునాథ్ ఇదివరకే ఒక బాబుకి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం జున్నుకు నాలుగు సంవత్సరాల వయసు కాగా లాస్య మరోసారి తల్లి కాబోతుందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈమె తెలియజేశారు.ఇలా తరచు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే లాస్య ఏకంగా సీమంతపు ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఈమె సీమంతపు వేడుకలను నిర్వహించడంతో ఈ కార్యక్రమానికి పలువురు బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేశారు.బుల్లితెర నటిమణులు శ్రీవాణి, సుష్మ, బిగ్ బాస్ గీతూ రాయల్ వంటి వారు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.ప్రస్తుతం లాస్య సీమంతపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు లాస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈమె జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది.







