చిరంజీవి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదగడంతో పాటు తను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన అభిమానులకు తన వంతు సహాయం చేస్తూ సాధారణ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయాలని భావించిన చిరంజీవి కొన్ని కారణాల వల్ల తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.చిరంజీవి కొన్ని నెలల క్రితం కార్మికులకు ప్రయోజనం చేకూరేలా ఆస్పత్రి నిర్మాణం దిశగా అడుగులు వేస్తామని చెప్పారు.
అయితే అంతకుముందు ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన ప్రభాకర్ రెడ్డి కూతురు శైలజ కూడా చిత్రపురి కాలనీకి చెందిన కార్మికుల కొరకు ఆస్పత్రిని నిర్మించాలని భావించారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శైలజ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.గత నెల 29వ తేదీన ఎం.ఐ.జీ హెచ్.ఐ.జీ ఫ్లాట్ల సామూహిక గృహ ప్రవేశాల మహోత్సవం జరగగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం తన తల్లిని బాధించిందని శైలజ కామెంట్లు చేయడం గమనార్హం.ఫౌండర్స్ అయిన మాకు ఆహ్వానం అందకపోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
నాన్న పేరుతో జరుగుతున్న కార్యక్రమానికి అమ్మను ఆహ్వానించకపోవడం కరెక్ట్ కాదని ఆమె కామెంట్లు చేశారు.కార్మికుల కోసం మేము ఆస్పత్రిని నిర్మించాలని భావిస్తుంటే చిరంజీవి పేరు చెప్పి వెనక్కు నెడుతున్నారని శైలజ పేర్కొన్నారు.
శైలజ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శైలజ చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
శైలజ రాబోయే రోజుల్లో ఆస్పత్రిని నిర్మిస్తారేమో చూడాల్సి ఉంది.







