మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే.మొన్నటివరకు ఈ జంటకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఈ మధ్యకాలంలో ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో అంతగా వినిపించడం లేదు.శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఇద్దరూ విడివిడిగా ఉన్నారని, తొందరలోనే విడాకులు తీసుకుని విడిపోతున్నారని ఇలా అనేక రకాల వార్తలు వినిపించినప్పటికీ ఆ వార్తలపై శ్రీజ కళ్యాణ్ దేవ్ కానీ అలాగే మెగా ఫ్యామిలీ కానీ స్పందించలేదు.
శ్రీజ ఇంట్లో మెగా ఇంట్లో వేడుకలు జరిగినప్పటికీ కళ్యాణ్ దేవ్ పాల్గొనక పోవడంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది అభిప్రాయపడ్డారు.
కళ్యాణ్ దేవ్ మాత్రం తన ముద్దుల కుమార్తె గురించి మాత్రమే పోస్ట్లు పెడుతూ ఉండేవాడు.
దాంతో వారిద్దరూ విడిపోయారు అన్న అనుమానాలు బలపడుతూ వచ్చాయి.ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ లు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోని తాజాగా 2023 సంవత్సరం మరికొద్ది గంటలు రాబోతుంది అనగా కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికర పోస్టును చేశాడు.ఆ పోస్ట్ లో కళ్యాణ్ దేవ్ ఈ విధంగా రాసుకొచ్చాడు.2022 సంవత్సరం నాకు చాలా నేర్పింది.ఈ ఏడాది ఎదుగుదలను ఇచ్చింది.అలాగే సహనంతో ఉండటం నేర్చుకున్నాను.అవకాశాలు అందుకున్నాను.రిస్కులు చేశాను.నా తప్పుల నుంచి నేర్చుకున్నాను.
ఇతరుల తప్పులను క్షమించడం అలవాటు చేసుకున్నాను.

ఎటువంటి పరిస్థితుల్లో అయిన నా ప్రయత్నాన్ని ఆపను.మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని కళ్యాణ్ దేవ్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.శ్రీజ, కళ్యాణ్ దేవ్ 2016లో ఒకటైన విషయం తెలిసిందే.
ఇద్దరికీ అది రెండవ వివాహమే.అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి ఉండడం లేదు.
అంతే కాకుండా వారిద్దరు ఒకరి గురించి ఒకరు స్పందించుకోవడం లేదు.కళ్యాణ్ దేవ్ శ్రీజ దంపతులకు ఒక పాప కూడా ఉన్న విషయం తెలిసిందే.







