తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.అయితే ఈయన చంద్రలేఖ సినిమా సమయంలోనే నటి రమ్యకృష్ణతో ప్రేమలో పడటం ఈ ప్రేమ బంధం నుంచి వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
ఇలా కృష్ణవంశీ రమ్యకృష్ణ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
ఇక కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో సినిమాలు కాస్త తగ్గించినప్పటికీ తాజాగా ఈయన రంగ మార్తాండ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ వంటి తదితరులు నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేసారు.ఈ సినిమా అనుకున్న దానికన్నా అధిక బడ్జెట్ అయిందని అయితే రమ్యకృష్ణ తాను బడ్జెట్ కంట్రోల్ చేసామని తెలిపారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మరోసారి రమ్యకృష్ణ కృష్ణవంశీల విడాకుల వార్తల గురించి మరోసారి స్పందించారు.ప్రస్తుతం తామిద్దరం సినిమా పనులతో బిజీగా ఉన్నాము దీంతో రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుందని తాను హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపారు.ఇలా వృత్తిపరంగా మేము విడిగా ఉన్నామే తప్ప విడాకులు తీసుకోలేదని ఇలాంటి వార్తలు సృష్టించడం ఒక శాడిస్ట్ పని… అలాంటి వారిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది.ఇంతకన్నా ఎక్కువ ఆలోచించలేకపోతున్నారా అనిపిస్తుందని,తన విడాకుల విషయంలో ఏమాత్రం నిజం లేదని కృష్ణవంశీ మరోసారి క్లారిటీ ఇచ్చారు.







