న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చిన బాలయ్య.. మాస్ విజువల్స్ తో వీడియో!

నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా ‘వీరసింహారెడ్డి’.మరొక 15 రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండుగకు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

 Roar Of Veera Simha Reddy, Balakrishna Veera Simha Reddy Making Video, Veera Sim-TeluguStop.com

”వీరసింహారెడ్డి” ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.ఇవన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటున్నాయి.ప్రమోషనల్ పరంగా దూసుకు పోతున్న మేకర్స్ తాజాగా మరొక చిన్న వీడియో రిలీజ్ చేసారు.లేటెస్ట్ గా మేకర్స్ కొత్త ఏడాది ట్రీట్ గా ఒక అప్డేట్ ఇచ్చారు.

వీరసింహారెడ్డి నుండి సాలిడ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

రోర్ ఆఫ్ వీరసింహారెడ్డి పేరుతో మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో మాస్ విజువల్స్ తో అదిరిపోయింది అనే చెప్పాలి.కీలక సన్నివేశాల్లో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా సెట్స్ లో నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా కనిపించి సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

మరి సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే. బాలయ్య అఖండ వంటి బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.

మరి వీరసింహ రెడ్డి సినిమాతో ఇదే విజయాన్ని కొనసాగిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube