క్రిస్మస్ వేళ అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల భారత సంతతి చిన్నారి దుర్మరణం

క్రిస్మస్ పర్వదినం నాడు అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

 2 Year Old Indian Origin Boy Killed In Road Accident In Usa Details, 2 Year Old-TeluguStop.com

నెవాడా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.మృతుడిని కాలిఫోర్నియాలోని ఇర్విన్‌కు చెందిన ఆరవ్ ముత్యాలగా గుర్తించారు.

మిన్ వ్యాన్ బోల్తా పడటంతో చిన్నారి తలకు తీవ్రగాయాలవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు లాస్ వెగాస్ రివ్యూ జర్నల్ వార్తాపత్రిక నివేదించింది.క్లార్క్ కౌంటీ కరోనర్ కార్యాలయం కూడా సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ సమీపంలోని ఎడారిలో క్రిస్మస్ రోజు జరిగిన ప్రమాదాన్ని ధ్రువీకరించింది.

నెవాడా హైవే పెట్రోల్ ప్రకారం.లాస్ వెగాస్ బౌలేవార్డ్ సౌత్‌లో మైల్ మార్కర్ 12 వద్ద ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సెవెన్ మ్యాజిక్ అనేది పర్వతారోహకులకు, స్థానికులకు ఫేవరేట్ పిక్నిక్ స్పాట్.

ఇకపోతే.రెండ్రోజుల క్రితం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.మృతుడిని 26 ఏళ్ల మన్‌ప్రీత్‌ సింగ్‌గా గుర్తించారు.పెన్సిల్వేనియా రాష్ట్రం క్లారియన్ టౌన్‌షిప్‌లో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

మన్‌ప్రీత్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తున్నారు.తన వ్యక్తిగత వాహనంలో ఈ నెల 24న ఉదయం 6.30 గంటలకు పెన్సిల్వేనియా వెళ్తున్న సమయంలో క్లారియన్ టౌన్‌షిప్‌ వద్ద వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో మన్‌ప్రీత్ వాహనం కూడా చిక్కుకోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

సహాయక బృందాలు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయాడు.

Telugu Indian Boy, America, Canada, Christmas, Las Vegas, Manpreet, Nri, Road, U

ఇదిలావుండగా… కెనడాలో బస్సు బోల్తా పడిన ఘటనలో భారత సంతతి వ్యక్తి సహా నలుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.రహదారిపై పేరుకుపోయిన మంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.మృతి చెందిన భారతీయుడిని పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి చెందిన కరణ్‌జిత్ సింగ్ సోధి (41)గా గుర్తించారు.మిగిలిన వారిని కెనడా అధికారులు గుర్తించాల్సి వుంది.డిసెంబర్ 24న వాంకోవర్ – కెలోవ్నా మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సర్రే కేంద్రంగా పనిచేస్తున్న పంజాబీ వార్తాపత్రిక అకల్ గార్డియన్ ఎడిటర్ గుర్‌ప్రీత్ ఎస్ సహోటా ట్వీట్ చేశారు.ఇక కరణ్‌జిత్ ఒకానగాన్ వైనరీకి చెందిన రెస్టారెంట్‌లో చెఫ్‌గా ఉద్యోగం చేస్తున్నాడని.

తన భార్య, కుమారుడు, కుమార్తెను పంజాబ్‌లోనే వుంచి అతను కెనడాకు వచ్చినట్లు గుర్‌ప్రీత్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube