అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కు పోలీసులు రిమాండ్ విధించారు.బైరి నరేశ్ తో పాటు ప్రోగ్రామ్ నిర్వహించిన డోలు హనుమంతు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నరేశ్ పై 153(ఏ), 295 (ఏ), 298, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.24 గంటల్లో నరేశ్, హనుమంతును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్న ఎస్పీ.మత విద్వేషాలను రెచ్చగొడితే ఉపేక్షించేది లేదని తెలిపారు.బైరి నరేశ్ గతంలో కూడా చట్ట వ్యతిరేక పనులు చేశాడని వెల్లడించారు.
తాజా వార్తలు