అభిమానుల్ని ఫూల్స్ చేసిన వర్షిణి.. డేట్ కి వెళ్ళానంటూ చివరికి షాక్?

అప్పుడప్పుడు సెలబ్రిటీలలో కూడా కొన్ని కొన్ని యాంగిల్స్ బయట పడుతూ ఉంటాయి.వాళ్లు కూడా ఇతరులను ఆటపట్టించడంలో ముందుంటారు.

 Varshini Fooled The Fans Went On A Date And Got A Shock At The End , Varshini, F-TeluguStop.com

అయితే ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఉండటంతో కొన్ని కొన్ని విషయాల ద్వారా ఫాలోవర్స్ ని బాగా ఆటపట్టిస్తున్నారు సెలబ్రిటీలు.ఇప్పటికే బుల్లితెర నటి హిమజ తన వీడియోస్ తో అందరినీ ఫూల్స్ చేసింది.

  తాజాగా మరో ఆర్టిస్ట్, యాంకర్ వర్షిణి కూడా అందర్నీ ఫూల్స్ చేసింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీకి చెందిన యాంకర్ వర్షిణి.సోషల్ మీడియా ద్వారా పరిచయమై ఢీ డాన్స్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.

అలా అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా ఉండగా.తన లుక్స్, డాన్సులతో బాగా కవ్వించింది.

ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఇక ఢీ షో నుంచి బయటికి వచ్చాక.మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా యాంకరింగ్ ను మళ్లీ పరిచయం చేసింది.

ఇక ఇందులో తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని తనవైపు లాక్కుంది.ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ ఈ బ్యూటీ కి బుల్లితెర పైనే కలిసొచ్చింది.ప్రస్తుతం యాంకర్ బాధ్యతలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రసారమైయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో,  ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది వర్షిణి.

తనకు ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా సమాధానం చెబుతుంది.

ఇక తన ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతి పోకుండా ఉండదని చెప్పవచ్చు.

ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన వర్షిణి తను దాచుకున్న అందాలన్నీ ఈమధ్య బయట పెడుతుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తను నడుము, థైస్ అందాలు, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తను తన ఫాలోవర్స్ ని ఫూల్స్ చేసింది.తాజాగా తన ఇన్ స్టాలో ఒక వీడియో పంచుకుంది.

  అందులో తను నిన్న డేట్ కి వెళ్లాను అంటూ.డేట్ చాలా బాగుంది అని.అసలు అలాంటి డేట్ ఎక్కడా లేదు అంటూ మాట్లాడింది.అయితే మామూలుగా డేట్ అంటే డేటింగ్ అని అర్థం.

రిలేషన్ షిప్ లో ఉండే  అమ్మాయి, అబ్బాయి బయటికి వెళ్లే దానిని డేటింగ్ అని అంటుంటారు.అయితే ఖర్జూరం పండును కూడా డేట్స్ అని అంటారు.

అయితే ఇంతవరకు తను చెప్పింది ఎవరు అబ్బాయితో డేట్ కి వెళ్ళింది కాదు అంటూ.తను నల్ల ఖర్జూరం గురించి చెబుతున్నాను అని అవి తిన్నాను అని ఫూల్ చేసింది.

రేపు తను గోడంబి తినబోతున్నాను అంటూ తెలిపింది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube