ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అందరికీ సుపరిచితుడే.బ్యాటింగ్ మరియు బౌలింగ్ లలో రెండు రకాలుగా ఆల్ రౌండర్ గా రాణిస్తూ ఉన్నాడు.
టి20 వరల్డ్ కప్ టోర్నీలో కీలకమైన మ్యాచ్ లలో హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించడం జరిగింది.ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లలో హార్దిక్ పాండ్యా… అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే… హార్దిక్ పాండ్యా కి టి20 కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పడానికి బీసీసీఐ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హార్దిక్ పాండ్యా బేటీ కావడం సంచలనంగా మారింది.
విషయంలోకి వెళ్తే తన సోదరుడు కృనల్ పాండ్యాతో… అమిత్ షా తో హార్దిక్ పాండ్యా భేటీ అయ్యారు.అనంతరం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.“మమ్మల్ని ఆహ్వానించినందుకు, మా కోసం సమయం కేటాయించినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు.మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది”…అని స్పష్టం చేశారు.







