వెంకటేష్ హీరో గా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన నారప్ప సినిమా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.తమిళ చిత్రం అసురన్ కి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలుసు.
ధనుష్ అక్కడ కీలక పాత్ర లో నటించగా ఇక్కడ వెంకటేష్ నారప్ప గా నటించి మెప్పించాడు.కరోనా కారణంగా ఈ సినిమా అప్పట్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వెంకటేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడం కరెక్ట్ కాదు అంటూ విమర్శించారు.ఇప్పుడు థియేటర్లు సాధారణ స్థితిలో ఉన్నాయి.
దాంతో నారప్ప సినిమా ను సురేష్ బాబు థియేటర్ రిలీజ్ చేశాడు.
ఓటీటీ ద్వారా విడుదలైన ఇన్ని నెలల తర్వాత థియేటర్ రిలీజ్ అయిన మొదటి సినిమా ఇదే.వెంకటేష్ కి ఉన్న క్రేజ్ మరియు నారప్ప సినిమా ఇప్పటికే సక్సెస్ అయిన నేపథ్యం లో తప్పకుండా

మినిమం కలెక్షన్స్ థియేటర్స్ ద్వారా వస్తాయని సురేష్ బాబు ఆశించి ఉంటాడు.అందుకే థియేటర్ రిలీజ్ కి సిద్ధమయ్యాడు.ఏకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ నారప్ప సినిమా రిలీజ్ గురించి ప్రకటన చేయడం జరిగింది.ఇటీవల ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా వచ్చిన నారప్ప తీవ్రంగా నిరాశ పరిచింది.
కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తుందని సురేష్ బాబు భావించాడట.కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం పాతిక లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసిందట.
నారప్ప ను ఇప్పటికే ఓటీటీ ద్వారా చూసిన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలి అనుకోలేదు అనుకుంటా.అందుకే అక్కడ క్యూ కనిపించలేదు.
కలెక్షన్లు రాలేదు.ఇది సురేష్ బాబుకు మాత్రమే కాకుండా ఇతర నిర్మాతలకు కూడా చాలా పెద్ద గుణ పాఠంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







