సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ సవాళ్లతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ తీరుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తాము సంయమనంగా ఉన్నామన్న ఆయన రెచ్చగొడితే ఊరుకోమని హెచ్చరించారు.అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తే స్వాగతిస్తామని, అధికార మంత్రులకు స్వాగతం పలుకుతామన్నారు.
కానీ పార్టీ కార్యక్రమాలుగా మారిస్తే మాత్రం ఊరుకోమని వెల్లడించారు.







