పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు నిర్మాత ఏ యం రత్నం.తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఈయన నిర్మాణంలో హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఇలా ఈయన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా తిరిగి నూతన సంవత్సరం కానుకగా మరోసారి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిలో దేవుడని ఆయన లాంటి హీరోని తాను ఇప్పటివరకు చూడలేదని ఈయన వెల్లడించారు.పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తొలి తరం హీరో తమిళనాడు సూపర్ స్టార్ ఎంజీఆర్ గుర్తుకు వస్తారని తెలియజేశారు.
ఎంజీఆర్ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఒకే విధంగా ఉంటుందని నిర్మాత ఏం రత్నం తెలియజేశారు.ఇక పవన్ గారిని తాను ఒక నటుడిగా కంటే ఒక వ్యక్తిగానే ఎక్కువగా అభిమానిస్తానని తెలిపారు.
ఆయన చీమకు హాని కలిగిన తట్టుకోలేరు.

తన పక్కనున్న వారికి ఆపద వస్తే వారికి సహాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారని తెలిపారు.ఇలా కౌలు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ తను సినిమాలలో కష్టపడి సంపాదించినది మొత్తం కౌలు రైతులకు పరిహారంగా చెల్లించారు.ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారని నిర్మాత ఏ యం రత్నం పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
.







