ఒకప్పటి హీరోయిన్ ఏపీ మంత్రి రోజా గురించి మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో రోజా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
తరచూ రోజా ఆపోజిట్ పార్టీలు అయినా టిడిపి జనసేన పార్టీ లపై ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.ఇది ఇలా ఉంటే ఇటీవల రోజా పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడంతో జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.
తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ మాట్లాడింది.తాజాగా తిరుపతిలో మాట్లాడిన రోజా.
పవన్ కళ్యాణ్ ని చూస్తే వోడాఫోన్ గుర్తుకు వస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఎందుకంటే చంద్రబాబు ఎక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడు అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు షోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ.ఇప్పుడు ఏ షో కి వెళ్ళని పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాలయ్య షోకి ఎందుకు వెళ్ళాడు అని ఆమె ప్రశ్నించింది.
గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులనే బాలయ్య బాబు ఇలా తిట్టారు వారిపై ఎలా విరుచుకుపడ్డారు మరొకసారి గుర్తు చేసింది రోజా.అనంతరం నారా చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర గురించి మాట్లాడుతూ.

అది యువగలమా లేకపోతే నారాగలమా అని అనుమానం వ్యక్తం చేసింది.ఈ పాదయాత్రతో లోకేష్ ఏం సాధిస్తాడు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడ కొట్టడం, లోకేష్ పాదయాత్ర చేయడం రెండు ఒకటే అంటూ రోజా సెటైర్లు వేసింది.అయితే తాజాగా పవన్ పై మరొకసారి రోజా సెటైర్లు వేయడంతో జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో రోజాపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.మరి రోజా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.







