టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యన స్పీడు పెంచారు.ఏపీ తెలంగాణ అనే తేడా లేకుండా ప్రచారాలు హోరెత్తిస్తున్నారు.
ఆరు పదుల వయసు దాటినా.యంగ్ అండ్ డైనమిక్ లా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ఒక్క ఖమ్మం సభతోనే బాబు.టీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టించారు.
దాంతో మాజీ టీడీపీ నేతలంతా.వరుసగా మీటింగులు పెట్టి మరీ బాబు వ్యాఖ్యలను ఖండించారు.
ఇక టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ ఎజెండా.గా సాగిన కేసీఆర్ ప్రయాణం.
ఇప్పుడు జాతీయ రాజకీయాలపై పడటంతో పార్టీ పేరునే మర్చేశారు.
ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తామని.
పార్టీ సభ్యత్వాలపై ఫోకస్ పెట్టాలని చెప్పడంతో.టీడీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది.
తెలంగాణలోనూ టీడీపీకి అవకాశం ఉందని.భావించడంతో ఇక్కడ కూడా స్పీడు పెంచాడు.
పార్టీలోకి చేరికలపై ఫోకస్ పెట్టాలని.పార్టీలో నుంచి వెళ్లిపోయిన వారందరూ తిరిగి రావాలని ఆహ్వనించాడు.
ఇక మాజీ టీడీపీ నేతలంతా చెరో పార్టీలో చేరిపోవడంతో వారిని ఎలాగైనా తిరిగి సొంత గూటికి చేర్చేందుకు అధినేత ప్లాన్ చేస్తున్నారు.అదే ఇటు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలోనూ కలకలం రేపుతోంది.

మరోవైపు ఏపీలోనూ చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని యాత్రలు చేస్తున్నారు.వచ్చే నెలలో నారా లోకేష్ పాదయాత్ర ఉండటంతో.దానికోసం ముందస్తుగా కేడర్ ను అధినేత సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది.తాను తీసుకొచ్చిన ఊపును లోకేష్ కంటిన్యూ చేస్తే.ఆయనకు మాస్ ఫాలోయింగ్ పెరిగే చాన్స్ ఉందని ఆలోచిస్తున్నారు.మరోవైపు జనసేన బస్సు యాత్ర కూడా ఉండటంతో తన కేడర్ జనసేన వైపు మొగ్గకుండా ఉండేందుకు.
ముందస్తుగా వ్యూహాలు రచిస్తున్నారు.కాపు రాజకీయం వేడెక్కడంతో.
ఆయన పార్టీ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి వచ్చిందని కొందఃరు నేతలు చెబుతున్నారు.మరి చంద్రబాబు అంతర్మథనం ఏంటో గానీ.
ఇటు తెలంగాణలోని పొలిటికల్ పార్టీలతో పాటు, ఏపీలోని రాజకీయ నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నారు.








