కన్నడ హీరో రిశబ్ శెట్టి దర్శకత్వం వచ్చిన కాంతర సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.కేవలం కన్నడ భాషలో విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో తిరిగి ఈ చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేశారు.
ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలోనే ఆయన హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది.ఇలా కాంతార సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే గతంలో కూడా రిషబ్ శెట్టి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది కానీ అయితే కాస్త ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు.ఇక ఈ సినిమాని కేవలం 16 కోట్ల రూపాయలతో నిర్మించగా ఏకంగా నాలుగు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఈ చిత్రాన్ని కేజిఎఫ్ వంటి చిత్రాలను నిర్మించిన హోం భలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కింది.అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలు కాంతర సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా హోం భలే ఫిలిం మేకర్స్ మాట్లాడుతూ కాంతార సినిమా సీక్వెల్ పై తమకు స్పష్టమైన ప్రణాళిక ఉంది.అయితే ప్రస్తుతం తాము ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని అందుకే ఇది కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు.అయితే రిషబ్ శెట్టి కూడా తనకు ఒక నెలపాటు విరామం కావాలని అడిగారట.ఆయన తిరిగి వచ్చిన తర్వాత కాంతర సినిమా సీక్వెల్ చిత్రం గురించి పనులు మొదలవుతాయని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని హోంభలే ఫిలిం మేకర్స్ కాంతార సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చారు.







