ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన బ్రహ్మాజీ భిన్నమైన పాత్రలతో కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.బ్రహ్మాజీ వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిలా కనిపించడం ఆయనకు ప్లస్ అవుతోంది.అయితే 18 పేజెస్ సినిమా విషయంలో ఆయనకు ఘోర అవమానం జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.18 పేజెస్ ట్రైలర్ లో కనిపించిన బ్రహ్మాజీ సినిమాలో లేకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
పెద్ద సినిమాలలో నిడివి ఎక్కువైతే షూట్ చేసిన కొన్ని పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను డిలీట్ చేయడం జరుగుతుంది.అయితే ట్రైలర్ లో చూపించిన పాత్రను డిలీట్ చేయడం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఓవర్సీస్ ప్రింట్లలో బ్రహ్మాజీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని ఇండియాలో మాత్రం లేవని కొంతమంది కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ట్రైలర్ లో కనిపించిన బ్రహ్మాజీ సినిమాలో ఎందుకు లేడంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
ఈ సినిమాలో బ్రహ్మాజీ నాలుగైదు సన్నివేశాలలో కనిపిస్తారని అయితే ఆ సన్నివేశాలు మొత్తం ఎడిటింగ్ లో పోయాయని సమాచారం అందుతోంది.తన సీన్లను తీసేయడం గురించి బ్రహ్మాజీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
బ్రహ్మాజీకి ఒక విధంగా ఇది అవమానమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కార్తికేయ2 సక్సెస్ తర్వాత విడుదలైన 18 పేజెస్ మూవీ అంచనాలను ఏ మాత్రం అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా సక్సెస్ సాధించి ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతున్నారు.కార్తికేయ2 సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న నిఖిల్ అనుపమ ఈ సినిమాతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.







