సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంత మంచి స్నేహితులో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేశాయి.
ఆ తర్వాత జనరేషన్ లో హరికృష్ణ నాగార్జునల మధ్య అనుబంధం కొనసాగింది.బాలయ్య నాగార్జునల మధ్య కూడా స్నేహ బంధం ఉంది.
వీళ్లిద్దరూ ఎక్కువగా కలవకపోయినా అభిప్రాయ బేధాలు లేవు.
అయితే బాలయ్య నాగ్ మధ్య గ్యాప్ ఉందని ఎన్నో కథనాలు తరచూ ప్రచారంలోకి వస్తున్నాయి.
ఒక సందర్భంలో బాలయ్య, నాగార్జున ఒకే వేదికపై తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టత ఇచ్చినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.అయితే నాగ్ ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ హీరో విషయంలో వస్తున్న విమర్శల గురించి స్పష్టత ఇస్తున్నారు.
స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని ఒక షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న వాళ్లు మరో ఓటీటీ షోలో పాల్గొనడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అగ్రిమెంట్ల నిబంధనల వల్లే బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు నాగార్జున హాజరు కావడం లేదని అంతకు మించి వీళ్లిద్దరి మధ్య గ్యాప్ లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.ప్రస్తుతం వీరసింహారెడ్డి చివరి షెడ్యూల్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరిగిందని ఇద్దరు హీరోల మధ్య నిజంగా గ్యాప్ ఉంటే బాలయ్య అక్కడ తన సినిమా షూటింగ్ కు ఎందుకు ఒప్పుకుంటారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

కొంతమంది ప్రచారం చేస్తున్న వార్తల వల్ల బాలయ్య నాగార్జున మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయని వాస్తవాలు మరోలా ఉన్నాయని ఫ్యాన్స్ వెల్లడించారు.నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా మంచి అనుబంధం ఉందని తారక్ నాగ్ ను ప్రేమతో బాబాయ్ అని పిలుస్తారని నాగార్జునకు కూడా ఈ జనరేషన్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని నాగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.బాలయ్య నాగ్ మధ్య గ్యాప్ లేదని వాళ్లిద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేసేలా కథనాలను ప్రచారం చేయొద్దని అలా ప్రచారం చేసేవాళ్లకు బుద్ధి లేదని నాగ్ అభిమానులు స్పష్టత ఇస్తున్నారు.







