ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో కాస్త ఉన్నత స్థాయి వ్యక్తి అయిన లేదా మధ్య తరగతి ప్రజలైన కచ్చితంగా విమాన ప్రయాణానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా విమానాశ్రయాలలో గొడవలు కూడా జరుగుతున్నాయి.
చాలామంది విమానాలలో అక్రమంగా ప్రయాణించడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.అందులో భాగంగానే గాంబియా నుంచి బ్రిటన్ కు వెళ్లిన జెట్ విమానంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది.
ఈ విమానం వీల్ బే లో ఒక వ్యక్తి మృతదేహం ఉంది.టి యు ఐ ఎయిర్ వేస్ నడుపుతున్న జెట్ విమానంలో గుర్తు తెలియని ఒక నల్ల జాతీయుడు మృతదేహాన్ని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
2022 డిసెంబర్ 5వ తేదీన గాంబియా రాజధాని బంజుల్ నుంచి లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి ఈ విమానం బయలుదేరి వెళ్ళింది.సరిగ్గా చెప్పాలంటే ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయినప్పుడే ఈ భాదకరమైన ఘటనను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం విల్ బే లోకి ప్రవేశించి మృతి చెంది ఉన్నట్లు వారు గుర్తించారు.

ఈ మృతదేహాన్ని విమానం నుంచి తొలగించి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ఈ విషయం గురించి ఇంకా చెప్పాలంటే గాంబియాన్ అధికారులు బ్రిటన్ పోలీసులకు సహకరించడమే కాకుండా మృతదేహానికి డిఎన్ఎ పరీక్షలు కూడా చేశారు.ఈ మేరకు యూకే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటి సారి ఏమీ కాదు.2019లో అమ్ స్టార్ డం లోని పోలీసులు కెన్యా నుంచి వచ్చిన కార్గో విమానం ముక్కు చక్రంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మరణించాడని వెల్లడించారు.







