అలా చేస్తే అవకాశాలు తగ్గిపోతాయి.. పూజా హెగ్డే కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఒకవైపు పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో పాటు మరొకవైపు ఆమెపై నెగటివ్ గా ప్రచారం జరుగుతుండడంతో అవి రెండూ ఆమెకు ఎక్కువ నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.

 Actress Pooja Hegde Response On Negative Comments,pooja Hegde,negative Comments,-TeluguStop.com

దీంతో తనపై ఎప్పుడూ ఇలాంటి ట్రోలింగ్స్ వచ్చిన పట్టించుకోని పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో తన రెమ్యూనరేషన్ విషయంలో తన విషయంలో వస్తున్న నెగిటివ్ వార్తలకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది.
కాగా ఇటీవలే చూసిన మీడియాలో పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో పట్టుదలకు పోతోందని రెమ్యునరేషన్ ని డిమాండ్ చెయ్యడం మాత్రమే కాకుండా మేకప్ మ్యాన్, ఆమెతో వచ్చే అసిస్టెంట్, మేనేజర్ అంటూ అలా దాదాపు 15 మంది సిబ్బంది ఖర్చు కూడా నిర్మాతల మీదే వేస్తోందని ఆ రకంగా నిర్మాతలకి పూజ హెగ్డే పెను భారంగా మారింది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అంతేకాకుండా సినిమా ప్లాప్ అయినా రెమ్యునరేషన్ ని ముక్కు పిండి మరి వసూలు చేస్తోంది అంటూ అంటూ పూజా హెగ్డే పై నెగెటివ్ ప్రచారాలు జరుగుతుండడంతో ఎట్టకేలకు పూజా హెగ్డే ఆ వార్తలకు అడ్డుకట్టవేసేసింది.ఆ నెగిటివ్ వార్తలపై పూజ హెగ్డే స్పందిస్తూ.

Telugu Pooja Hegde, Radhe Shyam, Tollywood, Trolls-Movie

కథ నచ్చినా, నేను అడిగిన పారితోషకం ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ ని నేను రిజెక్ట్ చేస్తున్నట్లుగా రాస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, తాను డబ్బు మాత్రమే ముఖ్యం అనుకునే టైప్ కాదని, అలా అయితే ఒకటి రెండు సినిమాలకి కనబడకుండా పోయేదాన్ని, ఇంతదాకా వచ్చేదాన్ని కాదు అంటూ అటువంటి వార్తలను సృష్టించే వారికి స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పింది బుట్ట బొమ్మ.ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో వచ్చిన ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాలి, అదే తెలివైన పని, కాదు నాకు పారితోషకం గట్టిగా ఇవ్వాల్సిందే అంటే.నేను కాకపోతే మరొకరు దొరుకుతారు.అంతేకాని సినిమా అయితే ఆగదు కదా మంచి చిత్రాలను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలి కానీ, డబ్బే ముఖ్యమని కూర్చోకూడదు అంటూ తనపై వస్తున్న దుష్ప్రచారానికి ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది పూజ హెగ్డే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube