ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ఎప్పుడూ ఎలా ఎక్కడ పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు.ఈ ప్రేమకు ప్రాంతీయ భేదాలు, దేశాలు, ఖండాలు లాంటి భేదాలు ఏమీ ఉండవు.
అలా దేశాలు దాటి వెళ్లి ఇద్దరినీ ఒకటి చేసిన ఒక ప్రేమ కథ ను ఇప్పుడు తెలుసుకుందాం.ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక కుర్రాడి ప్రేమ పెళ్లి వెనుక ఉన్న కథ ఇది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన్వర్ బస్టాండ్ కు దగ్గరలో ఒక మెకానిక్ షాప్ ఉంది.కానీ మెకానిక్ కు తబ్సుం తో పాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
వాళ్లలో తబ్సుం బాగా చదువుతుండడంతో ఆమె చదువులకు ఎంత ఖర్చైనా కూడా పెట్టేవారు.ఈ క్రమంలో తబ్సుం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది.
అక్కడ యాష్ హన్స్ చైల్డ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు.పరిచయం పెరిగి వారి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.అయితే 2016 సంవత్సరంలో ఆమె ఇండియాకు తిరిగి వచ్చేసింది.2017 సంవత్సరంలో తబ్సుం ప్రతిభను గుర్తించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమె చదువుల కోసం 45 లక్షల రూపాయలను మంజూరు చేసింది.డబ్బు మంజూరైన తర్వాత తబ్సుం మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్లి బ్రిస్బేన్ లో నివసిస్తూ ఉంది.ఈ క్రమంలో తబ్సుం హాస్టల్ మధ్య బంధం మరింత బలబడింది.

ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆస్ట్రేలియాలో కోర్టులో వీరు వివాహంతో ఒకటయ్యారు.ఆ తర్వాత తబ్సుం యష్ ఇద్దరు 10 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ కూడా హిందూ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు.ఇలా అన్ని విధాలు గా ఎలాంటి డ్రామా నడవకుండా వీరు ఒకటై పోయారు.వీరి గురించి విన్నవారు ప్రేమకు ఎల్లలు లేవని దానికి ఉదాహరణ ఈ జంట అని చెబుతున్నారు.
భారతీయ సంప్రదాయాన్ని ఇక్కడ పద్ధతులను పెళ్ళికొడుకు తల్లి చెప్పలేనంతగా ఇష్టపడడం రెండు కుటుంబాలకు మరింత సంతోషపడ్డారు.







