న్యూ ఇయర్‌ మహిమ... 2023 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్‌ పొందండిలా?

మరో 7 రోజుల్లో సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు రకరకాల ఆఫర్లు పెట్టి వినియోగదారులను ఊరిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇపుడు 2023 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్‌ అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 New Year Mahima 2023 Get A Flight Ticket For Rs ,new Year, Offers 2023 Rupees, F-TeluguStop.com

అవును, విమాన ప్రయాణం అంటే ఖరీదుతో కూడుకొన్నది.కొంత మందికి మాత్రమే ఇది పరిమితమైన అంశం.

కానీ ఇలాంటి ఆఫర్లుతో కొన్ని విమానయాన సంస్థలు సామాన్యులని సైతం ఆకట్టుకుంటున్న సందర్భాలు అనేకం వున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ విమానాయ సంస్థ అయినటువంటి ఇండిగో ప్రయాణికులకు ఓ బంపరాఫర్‌ ప్రకటించింది.

న్యూ ఇయర్‌ కానుకగా తక్కువ ధరకే విమానయానం చేసే అవకాశాన్ని కల్పించింది.అయితే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు ఉంటాయి అని వినియోగదారులు గమనించాలి.కేవలం నిర్ణీత తేదీల్లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకునే వారికి ఈ అవకాశం వుంది.రూ.2023కే విమాన టికెట్లు పొందే అవకాశం వారికి మాత్రేమే… ఆయా డేట్స్ లో మాత్రమే.

ఇంతకీ ఎప్పటినుండి ఇప్పటివరకు అంటే… డిసెంబర్‌ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రమే.ఈ డేట్స్ లో దేశీయంగా విమాన టికెట్ల ప్రారంభ ధర రూ.2023, అలాగే అంతర్జాతీయ విమానాల టికెట్‌ ధర కూడా కేవలం రూ.4999కే అందించడం విశేషం.ఈ 3 రోజుల్లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు జనవరి 15, 2023 నుంచి ఏప్రిల్‌ 14, 2023 మధ్య తేదీల్లో ప్రయాణం చేయొచ్చన్నమాట.

దీంతో పాటు HSBC బ్యాంక్‌ కార్డులతో టికెట్ బుక్‌ చేసుకునే వారికి అదనంగా డిస్కౌంట్ కూడా లభించనుంది.కొత్త ఏడాది సందర్భంగా ఇండిగో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube