మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన ధమాకా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి సినిమా ను నిర్మించారు ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా పెళ్లి సందడి ముద్దుగుమ్మ శ్రీ లీలా నటించిన విషయం తెలిసిందే.రవితేజ మరియు శ్రీ లీలా కాంబో కచ్చితంగా ప్రేక్షకులను అల్లరిస్తుందని అంతా భావించారు.
అనుకున్నట్లుగానే భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది.ముఖ్యం గా ఈ సినిమా కి పబ్లిసిటీ చేసిన విధానం అన్ని వర్గాల వారిని అలరించింది.
ప్రస్తుతం సినిమా కు సంబంధించి కలెక్షన్స్ పాజిటివ్ గా ఉన్నాయి.అందుకే సినిమా కు మంచి పబ్లిసిటీ చేస్తే ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయని పెద్దలు అంటూ ఉంటారు.
రవితేజ ఇన్ని సంవత్సరాల పాటు తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేవాడు కాదు.కానీ ఇప్పుడు ఆయన నటించిన ధమాకా సినిమా కు దాదాపు రెండు వారాల పాటు ప్రమోషన్ కార్యక్రమాలు పాల్గొన్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ధమాకా సినిమా కు తగ్గట్లుగా భారీ ప్రమోషన్ చేయడం తో సినిమా కు ఓపెనింగ్స్ అన్ని విధాలుగా పాజిటివ్ గా వస్తున్నాయి.లాంగ్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.రవితేజ కెరియర్ లో ధమాకా సినిమా నిలిచిపోయే సినిమా అవుతుందని ఆయన అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.రవితేజ తదుపరి సినిమా లు టైగర్ నాగేశ్వరరావు మరియు రావణసుర సినిమాలు కూడా భారీ విజయాలు సొంతం చేసుకునే విధంగా పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.







