మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సినిమా క్రాక్.ఈ సినిమా ఇతడి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
క్రాక్ రవితేజ కెరీర్ కు మాత్రమే కాదు మన టాలీవుడ్ కరోనా కారణంగా రేడేళ్లుగా ఇబ్బందులను పడుతున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.ఇది అస్సలు హిట్ అవ్వదు అని అనుకున్నారు.
ఆడియెన్స్ కూడా థియేటర్స్ కు రావడానికి ముందుకు రారు అని అనుకున్నారు కానీ అలాంటిని వారిని సైతం థియేటర్స్ కు రప్పించింది క్రాక్ సినిమా.మరి ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన విషయం విదితమే.
మరి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.గోపీచంద్ మలినేని రవితేజతో మరో సినిమాను చేస్తాను అని చెప్పాడు.
అది కూడా క్రాక్ సీక్వెల్ అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.ఈయన ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రాక్ 2 గురించి వివరణ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
గోపీచంద్ మలినేని రవితేజ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.డాన్ శీను, బలుపు మంచి హిట్ అయ్యాయి.ఇక క్రాక్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక ఆ తర్వాత చేయబోయే క్రాక్ 2 మరింత అంచనాలకు మించేలా ఉంటుంది అని తెలుస్తుంది.

ప్రెజెంట్ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు.నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఈ సినిమా సంక్రాంతి 2023లో రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాతో ఇతడు ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.







