తెలంగాణ రాష్ట్ర సమతిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేసీఆర్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తాజాగా టీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీగా మారింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యాకలాపాల్లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ విడుదల చేశారు.దీంతో ఇకనుంచి బీఆర్ఎస్ ఎల్పీగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.