కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” పాదయాత్ర దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.దక్షిణాది రాష్ట్రాల్లో కంప్లీట్ అయ్యి ఉత్తరాదిలో మధ్యప్రదేశ్ ఇంకా పలు రాష్ట్రాలలో ముగుంచుకొన్ని ప్రస్తుతం రాజస్థాన్ లో యాత్ర కొనసాగుతోంది.
ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు రాహుల్ గాంధీకి తమ సమస్యలు చెబుతూ పాదయాత్రకి అన్ని రకాలుగా మద్దతు తెలుపుతున్నారు.ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వం “భారత్ జోడో” యాత్రలో పాల్గొన్నే వాళ్లు కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
దీంతో రాహుల్ గాంధీ బీజీపీ పై మండిపడుతున్నారు.కరోనా పేరిట పాదయాత్రని అడ్డుకోవడానికి బీజేపీ కుట్రలు పన్నుతోంది. అయినా గాని తన పాదయాత్ర కాశ్మీర్ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ నేతలు ఓర్వలేక పోతున్నారని రాహుల్ మండిపడ్డారు.
ఇటీవలే కేంద్ర మంత్రి మాన్ సుఖ్ యాత్రలో కరోనా ప్రోటోకాల్ పాటించాలి లేదా వాయిదా వేసుకోవాలని రాహుల్ కి లెటర్ రాయడం జరిగింది. కేంద్ర మంత్రి మాన్ సుఖ్ లెటర్ కి ఈ రకంగా కౌంటర్ వేయడం జరిగింది.







