నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.బాలయ్య గత చిత్రం అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఢబుల్ ధమాకా అందించిన విషయం తెలిసిందే.ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా లో కూడా బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్ర లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
సాదారణంగా రెండు పాత్రల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు.బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో డబుల్ రోల్ అంటే చాలా పెద్ద విషయం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో కూడా బాలకృష్ణ డబ్బులు రోల్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఒకే సారి రెండు పాత్రల్లో నటించడం అంటే ఏ హీరోకైనా కష్టమే.అది కూడా రెండు సినిమాలో కాదు మూడు సినిమాలు.వరుసగా డబుల్ రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
బాలకృష్ణ సునాయాసంగా వరుసగా మూడు సినిమాలు చేస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వీర సింహారెడ్డి సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.అతి త్వరలోనే ఈ సినిమా యొక్క ట్రైలర్ రాబోతుంది అంటున్నారు.
అనిల్ రావిపూడి సినిమా కూడా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.ఆ సినిమా లో కూడా రెండు పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నాడు, కనుక కచ్చితంగా ఇది ఆయన కెరియర్ బెస్ట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.







