'హిట్ 2' హిందీ రిలీజ్.. పోస్టర్ తో అఫిషియల్ అనౌన్స్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ”హిట్ 2”.ఈ సినిమాతో హిట్ పరంపర మరోసారి కొనసాగుతుంది.

 Adivi Sesh Starrer Telugu Movie 'hit 2' To Release In Hindi, Adivi Sesh, hit 2,-TeluguStop.com

హిట్ 1 సినిమా విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించారు.వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ హిట్ ఫ్రాంచైజీ తెరకెక్కించారు.ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ స్పందన రావడంతో కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా మేకర్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా ప్రొమోషన్స్ సమయంలోనే హిందీ వర్షన్ కూడా ఉంటుంది అని అడవి శేష్ చెప్పడంతో పక్కాగా ఈ సినిమా హిందీలో ఉంటుంది అని తెలిసి పోయింది.

మరి ఇది రిలీజ్ అయిన నెల తర్వాత ఈ సినిమా హిందీలో రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ అఫిషియల్ గా రిలీజ్ చేసారు.డిసెంబర్ 30న ఈ సినిమా నార్త్ బెల్ట్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది.ఈ సినిమాను హిందీ లో గ్రాండ్ మాస్టర్ ఇంకా బి4యు మోషన్ పిక్చర్స్ విడుదల చేయనుంది.

అక్కడ కూడా త్వరలోనే ప్రొమోషన్స్ స్టార్ట్ కానున్నాయి.మరి నాని సమర్పణలో వచ్చిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube