తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే.ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ గెలిచిన విషయం తెలిసిందే.
రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు.ఇక మూడవ స్థానంలో కీర్తి, నాలుగవ స్థానంలో ఆదిరెడ్డి, ఐదవ స్థానంలో రోహిత్ చేరుకున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే డిసెంబర్ 18న బిగ్బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగిన విషయం తెలిసిందే.వీళ్ళలో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు బిగ్ బాస్ కేఫ్ లో పాల్గొంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోని తాజాగా బిగ్ బాస్ కేఫ్ లో ఆదిరెడ్డి పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే యాంకర్ శివ తనదైన శైలిలో ఆదిరెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు.ఈ సందర్భంగా శివ 15 వారాల జర్నీ అని అడగగా ఆ విషయంపై స్పందించిన ఆది చాలా టఫ్ జర్నీ అని తెలిపాడు.
హౌస్ లోకి వెళ్లడానికి మీ ఎజెండా ఏంటి అని అడగగా.బయట రివ్యూస్ చేసేటప్పుడు నెగిటివ్ అనిపించింది.కానీ లోపల కంటిస్టెంట్గా చేసినప్పుడు అనిపించదు అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.

అలాగే బిగ్బాస్ హౌస్లో లోపలికి పోయిన బయటకు వచ్చిన నాకు పెద్దగా పోయేది ఏమి ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అది రెడ్డి. టాప్ 3 లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేసావా అది రెడ్డి అని అడగగా ఊహించలేదు అని సమాధానం ఇచ్చాడు రెడ్డి.డబ్బులు తీసుకోవచ్చు కదా అని అడగగా 50 లక్షలు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకునే వాడిని కాదు అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.







