ఇపుడు దాదాపుగా స్మార్ట్ ఫోన్ లేనివారిని చూడటం అసాధ్యం.కూలిపని చేసేవాడిని మొదలు కొని, కూరగాయలు అమ్మేవారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు… అంతెందుకు ఆఖరికి బిక్షాటన చేసి బతికేవారు కూడా స్మార్ట్ ఫోన్ మెంటైన్ చేస్తున్నారంటే మీరు నమ్మితీరాలి.
దాంతో కొన్ని సోషల్ మెసేజింగ్ యాప్స్ అనేవి సహజంగానే ఆయా ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటున్నారు.అందులో ప్లేసులో వున్నది వాట్సాప్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
అవును, ప్రపంచంలో అత్యధికంగా వినియోగదారులు ఉపయోగిస్తున్న ఇన్‌స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్.
అయితే, ఈ యాప్‌కు ఇండియాలోనే అత్యధికంగా యూజర్‌లు ఉన్నారనే విషయం మీకు తెలుసా? ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూ వినియోగదారులకు మరింత చేరువవుతుంది.తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ తీసుకువచ్చింది.అవును, మీరు ఎప్పుడో ఒకసారి వాట్సాప్‌లో పొరపాటును ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరి పంపేసి ఉంటారు.ఆ వెంటనే తేరుకొని డిలీట్ కూడా చేసి ఉంటారు కదా.అయితే వాట్సాప్ మెసేజ్‌ను డిలీట్ చేసే సమయంలో Delete For Everyone ప్రెస్ చేయబోయి Delete For Me ప్రెస్ చేస్తే పరిస్థితి ఏంటి?

ఇలా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఈజీగా బయట పాడటానికి త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది.వాట్సాప్ తాజాగా Accidental Delete అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించిన విషయం మీకు తెలుసా? దీని ద్వారా వినియోగదారులకు యాక్షన్‌ను రివర్స్ చేయడానికి 5-సెకన్ల విండోను అందిస్తుంది.ఆ సమయంలో యూజర్లు UNDO చేయడం ద్వారా, మళ్లీ Delete For Everyone చేయవచ్చు.
ఈ కొత్త ఫీచర్ కొన్ని iPhone, Android డివైజ్‌లలో పరికరాల్లో అందుబాటులోకి వచ్చింది.త్వరలో ఇక్కడ కూడా అది అప్డేట్ కానుంది.







