సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు సినిమాలలో సక్సెస్ సాధించాలంటే రిస్కీ రోల్స్ లో నటించాలనే సంగతి తెలిసిందే.రిస్కీ రోల్స్ లో నటిస్తే మాత్రమే కెరీర్ పరంగా సక్సెస్ లను సొంతం చేసుకునే ఛాన్స్ తో పాటు ఎక్కువకాలం సకెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించవచ్చు.
అయితే 1200 రూపాయల కోసం శోభన్ బాబు చేసిన రిస్క్ గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవున్నారు.ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఒక ఇంటర్య్వూలో శోభన్ బాబు చేసిన రిస్క్ గురించి చెప్పుకొచ్చారు.
సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు కెరీర్ తొలినాళ్లలో అద్దె కట్టడానికి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.కెరీర్ తొలినాళ్లలో పారితోషికం కంటే వేషం ముఖ్యమని శోభన్ బాబు భావించారని ఇమంది రామారావు పేర్కొన్నారు.
శివుడి వేషంలో నిజమైన పాముతో శోభన్ బాబు యాక్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.ఆ పాత్ర ఇష్టం లేకపోయినా డబ్బు కోసం శోభన్ బాబు చేశారని ఇమంది రామారావు అన్నారు.

ఆ సీన్ షూట్ సమయంలో శోభన్ బాబు బాధ పడ్డారని ఆయన కామెంట్లు చేశారు.ఆ సినిమాకు 1200 రూపాయలు శోభన్ బాబుకు రెమ్యునరేషన్ గా దక్కిందని ఇమంది రామారావు వెల్లడించారు.1200 రూపాయలు ఇప్పుడు తక్కువ మొత్తమే అయినా ఆ సమయానికి ఈ డబ్బులు ఎక్కువ మొత్తమే కావడం గమనార్హం.మానవడు దానవుడు సినిమాతో శోభన్ బాబుకు స్టార్ స్టేటస్ దక్కింది.

అయితే స్టార్ స్టేటస్ ను అందుకున్న తర్వాత శోభన్ బాబు పారితోషికం విషయంలో కచ్చితంగా వ్యవహరించేవారట.శోభన్ బాబు తక్కువ ధరకే అప్పట్లో కొనుగోలు చేసిన స్థలాల విలువ ప్రస్తుతం వేల కోట్ల రూపాయలుగా ఉంది.శోభన్ బాబు దానాలు కూడా ఎక్కువగానే చేశారని అయితే ఆ విషయాలను చెప్పుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం.







