తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.ఉపాధి హామీ నిధులను టీఎస్ సర్కార్ దారి మళ్లించిందన్నారు.
ఎంపీ రేవంత్ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సమాధానం ఇచ్చారు.జూన్ లో తెలంగాణలో కేంద్ర బృందం ఉపాధి హామీ పనులను పరిశీలించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు.
పరిశీలనలో కేంద్ర బృందం అనేక అవకతవకలను గుర్తించిందని పేర్కొన్నారు.దారి మళ్లించిన నిధులు రూ.151.91 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రికవరీ చేయాలని సిఫార్సు చేసిందని స్పష్టం చేశారు.ఉపాధి హామీ పనుల రికార్డులను మార్గదర్శకాల ప్రకారం నిర్వహించలేదని వెల్లడించారు.పూడికతీత వంటి పనులకు ఉపాధి నిధులు ఎక్కువగా ఖర్చు చేశారని విమర్శించారు.కానీ నిజానికి పూడిక తీత జరగనే లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.