వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సెన్సేషనల్ మూవీ 'పుష్ప'..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.

 One Year Of Pan India Blockbuster Pushpa The Rise, Allu Arjun, Pushpa 2 , Direct-TeluguStop.com

ఇక పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచు కున్నాడు.ఇక ఈ సినిమా దాదాపు 400 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ సినిమా మాత్రమే ఐకాన్ స్టార్ కు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చి పెట్టింది.హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ఎక్కడో డౌట్ ఉన్నప్పటికీ రిలీజ్ అయినా తర్వాత అన్ని విషయాలు పటాపంచలు అయిపోయాయి.

అల్లు అర్జున్ దమ్ము ఎంత ఉందో చూపించి పాన్ ఇండియా వ్యాప్తంగా తనని తాను నిరూపించు కున్నాడు.

మరి పుష్ప వంటి ఎవర్ గ్రీన్ చిత్రం రిలీజ్ అయ్యి సరిగ్గా ఈ రోజుకు ఏడాది గడిచింది.గత ఏడాది డిసెంబర్ 17, 2021లో రిలీజ్ అయినా ఈ సినిమా ఈ రోజుకు ఏడాది పూర్తి చేసుకుంది.దీంతో మేకర్స్ సోషల్ మీడియా వ్యాప్తంగా తమ ఆనందాన్ని పంచు కున్నారు.

ఈ సినిమా వచ్చిన అవార్డులు, రివార్డుల గురించి గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేయగా అది నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.ఈ సీక్వెల్ ను మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు ప్రేక్షకులు.చూడాలి పుష్ప ది రూల్ ఎప్పుడు వస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube