సంక్రాంతి కానుకగా రాబోతున్న సినిమాల జాబితా దాదాపుగా కన్ఫమ్ అయ్యింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా డేట్ తో సహా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇక నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు తాజాగా ప్రారంభం అవ్వడంతో ఆయా హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు విజయ్ హీరో గా రూపొందిన వారసుడు కూడా ఈ సంక్రాంతి కి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
ఇప్పటి వరకు ఆ సినిమా లకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాలేదు.
తెలుగు వర్షన్ కి సంబంధించి ప్రమోషన్ మొదలు కాక పోవడం తో దిల్ రాజు వ్యూహం ఏంటో అర్థం కావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో వారసుడు ఏకంగా 50 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
తమిళనాట ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ నమోదు చేయాల్సి ఉంది కనుక అక్కడే ఎక్కువగా పబ్లిసిటీ చేయాలని ఇప్పటికే ప్రారంభించారు.

మొత్తానికి సంక్రాంతి కి అక్కడ విడుదల కాబోతున్న సినిమా లకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.అన్ని విధాలుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జనాల్లోకి సినిమాలను తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో పాటు ప్రతి ఒక్క మాస్ ఆడియన్స్ యొక్క ప్రజెంట్ కోరుతూ చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాల ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి కి మరో మూడు వారాలు ఉండగానే సందడి మొదలైనందుకు నందమూరి మరియు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







