పవన్ కళ్యాణ్ ఒక వైపు జన సేన పార్టీ ని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.
జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర ను చేసేందుకు గాను వారాహి వాహనం రెడీగా ఉంది.సంక్రాంతి తర్వాత ఏ క్షణం లో నైనా బస్సు యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ సమయం లోనే పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమా లకు కమిట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.పవన్ కళ్యాణ్ యొక్క బస్సు యాత్ర మరియు సినిమాలో షూటింగ్ ఎలా సాగుతాయి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఆ తర్వాత విజయవాడ లో జనసేన పార్టీ నాయకులతో మీటింగ్ ఉంది.
ఇలా రాజకీయాలు మరియు సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం అయితే సినిమాలకు ఎలా న్యాయం చేస్తాడు అంటూ ఆయన అభిమానుల్లోనే చర్చ జరుగుతుంది.

ఆయన బస్సు యాత్ర తో పాటు సినిమాల షూటింగ్ కి సమయం ఎలా కుదురుతుంది.టైం పాస్ కోసం సినిమాలు షూటింగులకు పాల్గొంటాడా.లేదంటే టైం పాస్ కోసం బస్సు యాత్ర చేస్తాడా అంటూ కొందరు ప్రత్యర్థి పార్టీ ల యొక్క నాయకులు ఆయన తీరు పై విమర్శలు గుప్పిస్తున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి అంటూ అభిమానులు ఆనందించే లోపే కొందరు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర గురించిన కామెంట్స్ చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.







