నటికి వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి... దూరంగా ఉండు అంటూ వార్నింగ్!

టాలీవుడ్ ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Singer Chinmayi Gave A Warning To The Actress Stay Away, Singer Chinmayi, Tamil-TeluguStop.com

అయితే గతంలో ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుతో తనకు పెద్ద ఎత్తున వివాదాలు ఏర్పడిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది.

వైరముత్తు తనని లైంగికంగా ఎన్నో హింసలకు గురి చేశాడంటూ ఈమె పెద్ద ఎత్తున వివాదం సృష్టించింది.అయితే వైరముత్తుకు సపోర్ట్ చేసిన వారు చిన్మయిన సోషల్ మీడియా వేదిక దారుణంగా ట్రోలింగ్ చేశారు.

ఇలా తనకు సోషల్ మీడియా వేదికగా చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ ఈమె మాత్రం వెనకడుగు వేయకుండా సమయం దొరికినప్పుడల్లా వైరముత్తును తనని టార్గెట్ చేస్తూ పోస్టులు వీడియోలు పెడుతూనే ఉన్నారు.

ఇక ఇతని విషయంలో చిన్మయి తాజాగా మరొక నటికి వార్నింగ్ ఇచ్చారు.

ప్రముఖ తమిళ నటి వీజే అర్చన ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.ఆ సినిమా షూటింగ్‌ దగ్గరకు వైరముత్తు వెళ్లడంతో అర్చన తనని కలిసి తనతో ఫోటోలు దిగారు.

ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె చూడండి నేను షూటింగ్‌లో ఉండగా ఎవరిని కలిశానో అంటూ ఆ ఫోటోలను షేర్ చేశారు.ఇందులో రచయిత వైరముత్తు అర్చన తలపై చేయి వేసి ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలపై స్పందించినచిన అర్చనకు తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు.

ఇది ఇలాగే మొదలవుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు.అతనితో తగినంత దూరాన్ని పాటించి తనకు దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా ఎవరు లేనప్పుడు తనని కలవద్దు అంటూ చిన్మయి నటి వీజే అర్చనకు వార్నింగ్ ఇచ్చారు.దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక చిన్మయి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ మలయాళ భాషలలో కూడా ఎంతో మందికి డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో ఫేమస్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube