తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలను బాయ్ కాట్ చేయాలని నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కమిటీ అంశం కొలిక్కి వచ్చే వరకు రేవంత్ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.ఇటీవల ప్రకటించిన కమిటీలపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా గాంధీభవన్ లో రేపు నిర్వహించాలనుకున్న పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.







