కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో టాప్ లేపే ఫాం లో ఉన్నా బాలీవుడ్ లో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది.హిందీలో ఆల్రెడీ అమితాబ్ తో గుడ్ బై సినిమా చేసిన రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేసిన మిషన్ మజ్నులో కూడా నటించింది.
పీరియాడికల్ మూవీగా దేశభక్తి కథతో వస్తున్న మిషన్ మజ్ను సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది.
ఈ సినిమాలో రష్మిక బ్లైండ్ రోల్ లో నటిస్తుంది.
కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి చాలెంజింగ్ రోల్ చేయలేదు రష్మిక.ఇక ఈ సినిమా ముందు థియేట్రికల్ రిలీజ్ అనుకున్నా దాన్ని కాదనుకుని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
షేర్షా సినిమా తరహాలో ఇండో పాక్ యుద్ధ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది.

టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు.ముఖ్యంగా రష్మిక బ్లైండ్ రోల్ మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు.ఇదే కాకుండా రష్మిక విజయ్ వారసుడు సినిమాలో నటించింది.
ఈ సినిమా తర్వాత మరో రెండు తెలుగు భారీ సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.







