పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.వైసీపీ, టీడీపీ ఘర్షణతో నివురుగప్పిన నిప్పులా మారింది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పిలుపునిచ్చిన చలో మాచర్లకు పోలీసులు ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు.టీడీపీ నేతలను హౌజ్ అరెస్టులు చేస్తున్నారు.
ఇప్పటికే ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులతో పాటు కోడెల శివరామ్ లను పోలీసులు గృహా నిర్బంధం చేశారు.టీడీపీ నేతలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.
అదేవిధంగా మాచర్లలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది.ఛలో మాచర్లకు అనుమతి లేదంటున్న పోలీసులు ఇతరులు ఎవరూ పట్టణానికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు.







