'అవతార్ 2' సెన్సేషన్.. మన తెలుగు ఆడియెన్స్ కు ఇంత క్రేజ్ ఏంటో?

2022 ఏడాది పూర్తి కాబోతుంది.మరొక 15 రోజులు అయితే ఈ ఏడాది పూర్తి అయ్యి కొత్త ఏడాది రాబోతుంది.

 Avatar 2 Movie Release Hungama In Telugu States, Avatar 2, Hollywood, Indian Mov-TeluguStop.com

మరి 2022 లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమాలు కూడా ఎన్నో వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే రికార్డులను క్రియేట్ చేసారు.

అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను తుడిచి పెట్టేందుకు హాలీవుడ్ రంగంలోకి దిగింది.

ఈ ఏడాదికి ఫైనల్ టచ్ గా హాలీవుడ్ మూవీ అవతార్ 2 గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా రిలీజ్ కాకుండానే మన సినిమాలు పాన్ ఇండియా వ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసింది.

ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత మిగిలి ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యింది.అవతార్ 2 వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురు చూసారు.

బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ‘అవతార్ 2’ ను హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ తెరకెక్కించాడు.ఈ సాలిడ్ విజువల్ అండ్ ఎమోషనల్ చిత్రం నిన్న డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మన ఇండియన్ సినిమా దగ్గర కూడా ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకుంటుంది.ఇక ఈ సినిమా తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయట.

అలాగే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ నేషనల్ వైడ్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారాయి.ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది.ఈ సినిమా నుండి వచ్చిన గ్రాస్ లో చాలా వరకు తెలుగు నుంచే వచ్చినట్టు తెలుస్తుంది.అలాగే సౌత్ ఇతర రాష్ట్రాల్లో అత్యధిక కంట్రిబ్యూషన్ కూడా తెలుగు నుంచే అని ట్రేడ్ వర్గాలు చెబుతుండడంతో అవతార్ 2 మన తెలుగు ఫ్యాన్స్ దెబ్బకు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube