సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో 2022 సంవత్సరం బ్యాడ్ ఇయర్ అని చాలామంది భావిస్తారు.ఈ ఏడాది మహేష్ నటించిన సర్కారు వారి పాట అబవ్ యావరేజ్ హిట్ గా నిలవగా మహేష్ వ్యక్తిగత జీవితంలో రక్త సంబంధీకులు దూరమయ్యారు.
కొన్ని నెలల గ్యాప్ లో తల్లీదండ్రులను కోల్పోవడం అంటే ఆ బాధ తట్టుకోవడం సులువు కాదు.మహేష్ కు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదని నెటిజన్లు కోరుకుంటున్నారు.
మహేష్ జీవితంలో చోటు చేసుకున్న వరుస విషాదాల వల్ల సినిమాలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురయ్యాయి.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి ఎన్నో ఆవాంతరాలు ఎదురవుతున్నాయి.
మహేష్ కెరీర్ లో ఎప్పుడూ లేని స్థాయిలో ఈ సంవత్సరం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మహేష్ కు ఇలాంటి రోజులు మళ్లీ రాకూడదంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
2023 సంవత్సరం నుంచి మహేష్ బాబుకు మంచి రోజులు రావాలని మరింత సక్సెస్ ఫుల్ గా మహేష్ కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో మహేష్ ఊహించని స్థాయిలో సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో కూడా మహేష్ కు లక్ కలిసిరావాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
మహేష్ సినిమాలకు భారీగా బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నారు.
మహేష్ బాబు రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలకు పైగా ఉందని సమాచారం.మహేష్ బాబు పూజా హెగ్డే జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పూజా హెగ్డే రెమ్యునరేషన్ 6 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలుస్తోంది.