తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభలో జాతీయ నేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బీజేపీ సభ డైలాగుల కోసం పాకులాడినట్లుందని విమర్శించారు.
బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ అంటే తమకు ఓటమి లేనట్లేనని నడ్డా ఒప్పుకున్నట్లేనన్నారు.కేంద్రం నెరవేర్చిన హామీలు ఏంటో నడ్డా చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆదాయం పెంచుతామని పెట్టుబడి రెట్టింపు చేశారని ఆరోపించారు.లక్షల డబ్బులు ఖాతాల్లో వేస్తామన్నారు.
కోట్లలో ఉద్యోగాలు ఇస్తామన్నారని ఎద్దేవా చేశారు.ఏ హామీని నెరవేర్చారని తమ గురించి మాట్లాడుతున్నారని నిలదీశారు.