బుల్లితెరపై కొంతకాలం క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు కొనసాగుతోంది.21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.కేవలం ఒక వారం మాత్రమే ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది.ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా కేవలం 5 మంది మాత్రమే ఫైనల్స్ కి చేరుకుంటారు.
ఇక తాజాగా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ అర్ధరాత్రి సమయంలో కంటెస్టెంట్లను కంగారుపెట్టాడు.మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ప్రేక్షకులకు చెప్పిన నాగార్జున కంటెస్టెంట్లకు మాత్రం తెలియజేయలేదు.
ఇక తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో బాస్ హౌస్ లో అర్ధరాత్రి సమయంలో కుక్కలు మొరిగాయి.అంతే కాకుండా డేంజర్ ని సూచించే సైరన్ కూడా మోగింది.
అయితే ఇలా హఠాత్తుగా సైరన్ మోగటంతో గాఢనిద్రలో ఉన్న కంటెస్టెంట్స్ కి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ లగేజ్ సర్దుకోమని ఆదేశించడంతో ఏం జరిగిందో అర్థం కాక కంటెస్టెంట్లు అందరూ చాలా టెన్షన్ పడ్డారు.
అసలు హౌస్ లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి కంటెస్టెంట్లకు చాలా సమయం పట్టింది.ప్రస్తుతం హౌస్ లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య ఉన్నారు.

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఈ ఆరుగురిలో ఒకరిని బయటకు పంపటానికి కంటెంట్ ని తమ అభిప్రాయం చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు.దీంతో కీర్తి ఆదిరెడ్డి పేరు చెప్పింది. ఆ తర్వాత శ్రీహాన్.రోహిత్ పేరు చెప్పాడు.శ్రీసత్య … కీర్తి, రోహిత్.శ్రీహాన్, రేవంత్… కీర్తి, ఆదిరెడ్డి.
కీర్తి పేరు చెప్పారు.అయితే కీర్తి పేరు ఎక్కువగా వినిపించడంతో ఆమె మీకు ఎలిమినేషన్స్ ద్వారా హౌస్ నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ప్రతివారం ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నారు.ఇప్పుడు కూడా ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసినట్లు ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది.







