సెల్ ఫోన్ షాపులో చోరీ చేయబోయాడు.. గ్లాస్ డోర్ ఉందని తెలియక ఇరుక్కుపోయాడు

మనకు తెలిసిన 64 కళల్లో చోర కళ కూడా ఒకటి.కొంత మంది ఇందులో చాలా నైపుణ్యం సంపాదిస్తుంటారు.

 He Was Going To Steal From A Cell Phone Shop He Got Stuck Not Knowing That There-TeluguStop.com

కళ్లు మూసి తెరిచే లోపే జేబులు కత్తిరించేస్తారు.తమ కంట పడిన దానిని చాలా నేర్పుగా దొంగిలిస్తుంటారు.

ఇటీవల కాలంలో కొత్త రకం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఏదైనా షాపులకు వెళ్లి అక్కడ ఏదో కొంటున్నట్లు నటించి విలుువైన వస్తువులను పట్టుకుని పరుగులు పెడుతున్నారు.

ఇదే కోవలో UKలోని డ్యూస్‌బరీలోని ఒక దుకాణం కౌంటర్ నుండి ఒక వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌తో పారిపోవడానికి ప్రయత్నించాడు.అయితే అతడి ప్రయత్నం బెడిసి కొట్టింది.

అనూహ్య రీతిలో దొంగతనం చేస్తూ పట్టుబడిపోయాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో యూకేలోని వెస్ట్ యార్క్‌షైర్‌లోని డ్యూస్‌బరీలో జరిగింది.ఓ దొంగ స్మార్ట్‌ఫోన్ దుకాణంలో ప్రవేశిస్తాడు.ఖరీదైన స్మార్ట్ ఫోన్ అడిగి దాని గురించి తెలుసుకుంటాడు.దుకాణంలో కొన్ని సరికొత్త ఫోన్‌లను చూడటం ఆ వీడియోలో కనిపిస్తుంది.1600 పౌండ్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను దొంగిలించాలనేది అతని ప్రణాళిక.అయితే దుకాణదారుడు తలుపు లాక్ చేయడం అతడికి తెలియదు.

అతను కస్టమర్‌గా నటిస్తూ ఫోన్ కొనడానికి షాప్‌లోకి ప్రవేశించాడు.ఇది తెలియక, దుకాణదారుడు కొన్ని మోడళ్లను అతనికి చూపిస్తూ, ఒకదానిని అతనికి ఇచ్చాడు.

అయితే ఫోన్ దొంగిలించాలనుకున్న ఆ వ్యక్తి ఫోన్ తీసుకుని షాపు నుంచి బయటికి పారిపోతాడు.అయితే అదే సమయంలో దుకాణాదారుడు చాలా తెలివిగా ప్రవర్తించాడు.తన వద్ద ఉన్న రిమోట్ సాయంతో ఆ షాపు డోర్ మూసేస్తాడు.2020లో 250 పౌండ్లతో డోర్ లాకింగ్ మెకానిజంను ఇన్‌స్టాల్ చేసినట్లు షాపు యజమాని అఫ్జల్ ఆడమ్ పేర్కొన్నాడు.ఈ సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది చూసిన నెటిజన్లు ఆ దొంగ పట్టుబడిన వైనంపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube