ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ముఖ్యంగా పొత్తుల వ్యవహారంలో పార్టీల వైఖరి ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు.
వైసిపి ఒంటరిగానే ఈ ఎన్నికలను ఎదుర్కునేందుకు సిద్ధమవుతుండగా, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే బీజేపీ ప్రకటన చేసింది.ఇది ఎలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం జనసేన, బిజెపి, టిడిపి కాంబినేషన్ లో ఎన్నికలకు వెళ్తే వైసిపిని చిత్తుగా ఓడించవచ్చనే లెక్కను తెరపైకి తీసుకువచ్చింది.
అయితే ఎట్టి పరిస్థితిలోనూ టిడిపి తో కలిసి వెళ్ళేందుకు బిజెపి నేతలు ఒప్పుకోవడం లేదు.గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును వారు ఇప్పుడు ఉదాహరిస్తున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం టిడిపిని కలుపుకు వెళ్తేనే వైసీపీ విజయం సాధించడం సులువు అవుతుందని బలంగా నమ్ముతున్నారు .కానీ ఈ విషయంలో బిజెపిపై ఒత్తిడి చేస్తున్నా, వారు అంగీకరించకపోవడంతో, సైలెంట్ గానే ఉంటున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే నిన్న జనసేన రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బిజెపి ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో గుంటూరులో భేటీ అయ్యారు ఈ భేటీలో ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియనప్పటికీ, కన్న లక్ష్మీనారాయణ ద్వారా బిజెపి అగ్రనేతలతో రాయబారం పంపేందుకు జనసేన ప్రయత్నిస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కుండా ఉండాలంటే, విపక్షాలన్నీ కలవాలని పవన్ పదేపదే చెబుతున్నారు.
ఇప్పుడు అది సాధ్యం అవ్వాలంటే బీజేపీని ఒప్పించాలని, దీనికి ఢిల్లీలో బాగా పలుకుబడి ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు బిజెపి పెద్దలను కలిసి ఈ ప్రతిపాదనకు ఒప్పిస్తే… వైసిపిని ఓడించాలనే తమ లక్ష్యం నెరవేరుతుందని జనసేన అభిప్రాయపడుతోందట.

ఈ వ్యవహారం ఇలా ఉంటే నిన్న నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ తో బేటి అవ్వగా, బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో దాదాపు 40 నిమిషాల పాటు కలిసి ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల గురించి వారి మధ్య ప్రస్తావన వచ్చినట్లు , టిడిపి జనసేన ను కలుపుకొని వెళ్తేనే వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లను గెలవచ్చని , వైసీపీని కట్టడి చేయవచ్చనే విషయాన్ని సీఎం రమేష్ అమిత్ షా కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.అటు ఢిల్లీలోనూ, ఇటు ఏపీ లోను బిజెపి టిడిపి జనసేన పొత్తుల వ్యవహారం పైనే చర్చ జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.







